** TELUGU LYRICS **
మనమీ మనుమీ మనస నీ వనుదినము యేసుని సరస ఘన ధనముల
నీవు రోసి దేవ తనయుని కృపఁ దల పోసి
నీవు రోసి దేవ తనయుని కృపఁ దల పోసి
||మనమీ||
1. మంకు తనములను విడిచి నీ భయంకర వేదనకు వెరచి యింక
వడి యేసు కడ కేగి పాద పంకజముల యొద్ద దాఁగి
||మనమీ||
2. ప్రాకటముగ నొప్పు నట్టి దైవ వాక్యంబు మనమునఁ బెట్టి శ్రీ కర
నాధుని నమ్మి ధాత్రి నీ కలుషమ్ములును జమ్మి

3. సృష్టి ప్రభువు నీకు లేఁడ యతని యిష్ట గుణగణమ్ములు బాడ
ఇష్టము తోడను వేఁడి నీదు దుష్ట గుణమ్ముల వీడి

4. చెంతఁ జేర వల దన్నాఁడ కడు వింతెన జనకుఁడు గాఁడా చింతలు
నీకిఁక నేల బహు సంతోషమున యేసు పాల

5. బిరబిర వరగురు దరికి నీ వరుగుము దురితముఁ బెరికి సురిచిరమగు
యేసు కరుణ నీకు మరణపు తరి నగు నాదరణ

6. నిరతమ్ము నాతనిమీఁద నీదు దురితముల నునుపరాద త్వరితమ్ముగ
నెమ్మిఁ జూపి దుష్ట చరితమ్మును వెళ్లబాపి

7. అమలాప్తుఁడు నిను డాయు నీదు శ్రమ లన్నియు వెడలఁ జేయు
విమలాత్మను దయచేయ నీతి కమలాప్తుని మది కీయ

8. అంచితముగ నుతి సేయు నిన్ రక్షించిన కృపా సంస్త్యాయు
నెంచుచు నాతని విభునిగఁ గీర్తించుచుఁ బరమ గురునిగ

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :