2309) మధురం మధురం దైవ వాక్యం

** TELUGU LYRICS **

    మధురం మధురం దైవ వాక్యం
    తేనెకన్న మధురం దేవుని వాక్యం
    చీకటి నిండిన వీదులలో
    కాంతిని వెదజల్లు దైవవాక్యం
    అ.ప:జీవమున్న వాక్యం జీవమిచ్చు వాక్యం
    దేవుని దివ్య వాక్యం

1.  ఖడ్గము కంటెను వాడిగలది
    ప్రాణాత్మలను విభజించెడి వాక్యం
    హృదయమునందలి చింతలను
    పరిశోదించెడి దైవ వాక్యం
    ||జీవమున్న||

2.  నాహృదయములో దైవ వాక్యం
    పదిలపరచుకొని యున్నందున
    పాపములోనే తడబడకుండ
    అడుగులు కాపాడు దైవ వాక్యం
    ||జీవమున్న||

3.  కష్టములలోన దైవవాక్యం
    నెమ్మది నిచ్చి నడిపించును
    అలసిన,కృంగిన వేళలలో
    జీవింపచేయు దైవ వాక్యం
    ||జీవమున్న||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------