2249) భయము లేదు మనకు ఇకపై ఎదురు వచ్చు గెలుపు


** TELUGU LYRICS **

భయము లేదు మనకు
ఇకపై ఎదురు వచ్చు గెలుపు
అదిగో యేసు పిలుపు
వినుమా పరము చేరు వరకు (2)
ఫలితమేదైన ప్రభును వీడకు
కష్టమెంతైన కలత చెందకు
అలుపు లేకుండ పరుగు సాగని
శోధనలు నిన్ను చూసి బెదరని          
||భయము||

సంధించిన బాణమల్లె నీ గురి కొనసాగని
మన తండ్రి వాగ్ధానాలే ఊపిరిగా మారని (2)
కష్టాలే మెట్లుగా మారి యేసులో ఎదిగించని
తన వాక్యం నీలో వెలిగి చీకటి తొలగించని (2)           
||ఫలిత||

మండించే అగ్గితోనే మెరయును బంగారము
శోధనల కొలిమిలోనే బలపడు విశ్వాసము (2)
నీ తరపున యుద్ధం చేసే యెహోవా నీ అండ
తొలగిపోకు ఆ మార్గన్నీ తన ఆజ్ఞను వినకుండా (2)     
||ఫలిత||

కనలేదా సిలువలోన యేసు రాజు కష్టము
తానొందిన శ్రమల ద్వారా నశియించే పాపము (2)
నీ శ్రమల కాలంలోనే మనసు దృఢము కావాలి
తిరిగి నీలో పుట్టే పాపం బీజము నశియించాలి (2)     
||ఫలిత||

ప్రియమైన పుత్రుని మనకై నలిగించిన దేవుడు
అప్పగించలేడా సకలం సర్వశక్తిమంతుడు (2)
తన సన్నిధి రావాలంటూ నిన్ను కోరుతున్నాడు
నీతి నీలో పెంచేటందుకు తపన పడుతూ ఉన్నాడు (2)     
||ఫలిత||

** ENGLISH LYRICS **

Bhayamu Ledu Manaku
Ikapai Eduru Vachchu Gelupu
Adigo Yesu Pilupu
Vinumaa Paramu Cheru Varaku (2)
Phalithamedaina Prabhunu Veedaku
Kashtamenthaina Kalatha Chendaku
Alupu Lekunda Parugu Saagani
Shodhanalu Ninnu Choosi Bedarani           
||Bhayamu||

Sandhinchina Baanamalle Nee Guri Konasaagani
Mana Thandri Vaagdhaanale Oopirigaa Maarani (2)
Kashtaale Metlugaa Maari Yesulo Ediginchani
Thana Vaakyam Neelo Veligi Cheekati Tholaginchani (2)        
||Phalitha||

Mandinche Aggithone Merayunu Bangaaramu
Shodhanala Kolimilone Balapadu Vishwaasamu (2)
Nee Tharapuna Yuddham Chese Yehovaa Nee Anda
Tholagipoku Aa Maargaanni Thana Aagnanau Vinakundaa (2) 
||Phalitha||

Kanaledaa Siluvalona Yesu Raaju Kashtamu
Thaanondina Shramala Dwaaraa Nashiyinche Paapamu (2)
Nee Shramala Kaalamlone Manasu Drudamu Kaavali
Thirigi Neelo Putte Paapam Beejamu Nashiyinchaali (2) 
||Phalitha||

Priyamaina Puthruni Manaki Naliginchina Devudu
Appaginchaledaa Sakalam Sarva Shakthimanthudu (2)
Thana Sannidhi Raavaalantu Ninnu Koruthunnaadu
Neethi Neelo Penchetanduku Thapana Paduthu Unnaadu (2) 
||Phalitha||

---------------------------------------------------------------
CREDITS : సాయారం గట్టు (Sayaram Gattu)
---------------------------------------------------------------