2227) బాలకా నీ వర్తనముగా పాడుకొని జీవింపరా

** TELUGU LYRICS **

    బాలకా నీ వర్తనముగా పాడుకొని జీవింపరా మేలులుకుఁ బలు కీడు
    లకునదె మూలమనిగమనింపరా 
    ||బాలకా||

1.  తప్పినడువకు మెన్నడేని తల్లిదండ్రులు యానతి తప్పిపోయిన సుతుఁడు
    పడిన తిప్పలు నీ వెఱుఁగవా?
    ||బాలకా||

2.  గోలచేయుచుఁ బెద్దలనుగని మేలమాడుట తగదురా బాలురా యెలిషాను
    నవ్వి ప్రాణగొడ్డమునొందరే
    ||బాలకా||

3.  పరులకెగ్గొనరింపఁబోకుము దొరలునదినీ మీఁదనే పరునికై హామాను
    నిల్పిన కొఱఁత నతఁడే వ్రేలఁడే
    ||బాలకా||

4.  కట్టఁడి కార్యంబుతుదకుఁ బట్టి కుడుపకపోదురా మిట్టిపడిన రాణి
    యెజెబె లెట్టులీల్గెనొ తెలియదా?
    ||బాలకా||

5.  వగవకుము పరధనముఁగనియది తెగులులేని బాధరా సుగతిగనెనె
    యాహబుతా శునకముల కాహారమై?
    ||బాలకా||
6.  ఆనృతంబులాడకుము దే హాంతమైన నేమిరా? ఆనృతము చేనని యాతన
    యాలితో సహకూలఁడే
    ||బాలకా||

7.  కోపమునకాన్పదమునీయఁ గోరకుము మదినెన్నడు కోప జ్వాలలు
    పెంచికయ్యిను గోడు చెందడె హంతయై
    ||బాలకా||

8.  తులువల జత గూడిమాడి చెలిమిచేయుట తగదురా పలువల
    సాంగత్యమున రెహ బాము భంగము నొందఁడే
    ||బాలకా||

9.  బాలుడా నీ తరుణ హృదయము ప్రభున కప్పగింపరా శీల సౌష్ఠవ
    మొదవునీ కా శీస్సులను జేకూరురా
    ||బాలకా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------