427) ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ


** TELUGU LYRICS **

ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ (2)
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం (2)      
||ఎడబాయని||

శోకపు లోయలలో - కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో - నిరాశ నిసృహలో (2)
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ (2)
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి (2)
||ఎడబాయని||

విశ్వాస పోరాటంలో - ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో - సడలితి విశ్వాసములో (2)
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2)
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి (2)
||ఎడబాయని||

నీ సేవలో ఎదురైన - ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని - నిరాశ చెందితిని (2)
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగ (2)
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి (2) 
||ఎడబాయని||

** ENGLISH LYRICS **

Edabaayani Nee Krupa
Nanu Viduvadu Ennatiki (2)
Yesayyaa Nee Premaanuraagam
Nanu Kaayunu Anukshanam (2)        
||Edabaayani||

Shokapu Loyalalo - Kashtaala Kadagandlalo
Kadaleni Kadalilo - Niraasha Nispruhalo (2)
Ardhame Kaani Ee Jeevitham
Ika Vyardhamani Nenanukonaga (2)
Krupaa Kanikaramugala Devaa
Naa Kashtaala Kadalini Daatinchithivi (2) 
||Edabaayani||

Vishwaasa Poraatamlo - Eduraaye Shodhanalu
Lokaashala Alajadilo - Sadalithi Vishwaasamulo (2)
Dushtula Kshemamune Choochi
Ika Neethi Vyardhamani Anukonaga (2)
Deerghashaanthamugala Devaa
Naa Cheyi Viduvaka Nadipinchithivi (2)
||Edabaayani||

Nee Sevalo Eduraina - Enno Samasyalalo
Naa Balamunu Choochukoni - Niraasha Chendithini (2)
Bhaaramaina Ee Sevanu
Ika Cheyalenani Anukonaga (2)
Pradhaana Yaajakudaa Yesu
Nee Anubhavaalatho Balaparachithivi (2)
||Edabaayani||

-------------------------------------------------
CREDITS : మాథ్యూస్ (Matthews)
-------------------------------------------------