425) ఎడబాయని దేవా ఇమ్మానుయేలు ప్రభువా

** TELUGU LYRICS **

    ఎడబాయని దేవా - ఇమ్మానుయేలు ప్రభువా
    మరువక విడువక నీ జనాంగమును నిత్యము కాచెడి దేవా
    అ.ప: స్తుతులను చెల్లింతును - స్తోత్రములర్పింతును

1.  నీదు మాటను లక్ష్యము చేయక ఎంతగానో విసికించినా
    నీకు విరోధముగా తిరుగబడి బహుకోపము పుట్టించినా
    నలువది ఏండ్లు నీ జనాంగమును ప్రేమతో కాచిన దేవా

2.  నీ సహాయము మాకు లేనిచో ఎపుడో నశించియుందుము
    నీదు హస్తము మాతో రానిచో మౌనములో దిగియుందుము
    గడచిన ఏండ్లు నీ జనుల మమ్ము దయతో కాచిన దేవా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------