1087) త్రిత్వమర్మము నెరిగిన మిత్రుండా ప్రాణమునిమ్ము

** TELUGU LYRICS **

    త్రిత్వమర్మము నెరిగిన - మిత్రుండా ప్రాణమునిమ్ము
    విలువ గలిగిన ప్రభుని - సిలువ భుజముపై మోసి

1.  గోధుమ భూమిలోపడిన - బహుగాను ఫలియించును
    మోదమున ప్రభుయేసునితో మరణించవలెను ప్రియుడా

2.  మహిమ నొందుటకు నీవు సాత్వికుండవు కావలెను
    మహిమ స్వరూపిని పోలి - నీవును జీవించవలెను

3.  క్రీస్తును ప్రేమను త్రాగి - ఆత్మవశుడవైనచో
    సైతాను సహవాసమును - సంపూర్ణముగా వదిలెదవు

4.  పొలము దున్నెడువాడు - వెనుక తిరిగి చూడడు
    ఇలలో నీవున్నను ప్రియుడా - యిలనే మరచిపోవలెను

5.  ప్రాణంబు పోయినగాని - విశ్వాసము విడువ వలదు
    ప్రియుడా నీదు ద్వారానే - పృథివి బాగుపడవలెను

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------