1094) తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో

** TELUGU LYRICS **

    తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో
    అంత దూరం పోయెను నా పాప భారము
    యేసు నన్ను తాకగానే తొలగిపోయెను
    నా పాపము -నా పాప భారము (2)

1.  రాతి వంటిది నాదు-పాత హృదయము
    మెత్తనైన మాంసపు-హృదయమాయెను
    ఎంత మధురము -నా యేసు రుధిరము
    నా కలుష హృదయమును-కడిగి వేసెను
    ||తూర్పు||

2.  పాప ఊబి నుండి నన్ను పైకి లేపెను
    పరమ జీవమార్గమును-నాకు జూపెను
    ఎంత రమ్యము -నా యేసు రాజ్యము
    యుగ యుగాలు -అదే నాకు పరమభాగ్యము
    ||తూర్పు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------