** TELUGU LYRICS **
తెలియక వారు సిలువ వేశారు
క్షమించమని ప్రార్ధించాడు యేసు (2)
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్ధించేదెవరు?
||తెలియక||
తిండికోసము జ్యేష్టత్వమును అమ్ముకున్నాడు ఏశావు
వెండికోసము శిష్యత్వమును అమ్ముకున్నాడు ఆ యూదా
ఎవరికోసం క్రైస్తవ్యమును అమ్ముకుంటాము మనము
ఏశావులా భ్రష్టులౌతాము యూదాల పడి చస్తాము
తెలిసి తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్ధించేదెవరు?
||తెలియక||
పదవి కోసము ప్రభువు యేసును
అమ్ముకొంటారా ఓటు నోటుకు?
ఆస్తులకోసం ప్రభువు క్రీస్తును అమ్ముకొంటారా పార్టీ కోర్టుకు?
దేవుని పాలన మనిషి పాలనగా మారితే మనము చీలిపోతాము
దేవుని ఇల్లు మనిషి ఇల్లుగా మారితే కూలి కాలిపోతాము
తెలిసీ తెలిసీ సిలువను వేస్తే
క్షమించేదెవరు? ప్రార్ధించేది ఎవరు?
---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Talachukunte Chalunayya (తలచుకుంటే చాలనాయా)
--------------------------------------------------------------------------------------