1061) తన రాజ్యమునకు మహిమకు పిలచిన

** TELUGU LYRICS **

    తన రాజ్యమునకు మహిమకు పిలచిన (2)
    మన ప్రభువుకు తగినట్టు నడిచెదము
    తన రాజ్యములో మనము చేరెదము

1.  కారుచీకటి కమ్మినను - యేసుని వెలుగులో నడిచెదము (2)
    మంచి కాపరి మనతోనుండగ - తనతో ముందుకే సాగెదము (2)

2.  ఇరుకు మార్గపు ఇబ్బందులలో - సిలువను మోయుచు వెళ్ళెదము
    యేసే మనదు భారము మోయుచు - మనకు మార్గము చూపును

3.  ఉప్పొంగుచున్న ఉపద్రవములలో - ఉన్నవాడనని ప్రభువనెను
    అంతము వరకు చెంత నిలిచి - తానే మనతో నడచును

4.  దారితొలగక గురి యొద్దకే - యేసునే చూచి నడచెదము
    ఇహమున శుద్ధులై నడచువారే - పరమున ప్రభువుతో సంచరించెదరు

5.  విశ్వాసమును విడువక - మంచి పోరాటం పోరాడి
    ప్రభువుతో నడచి పరుగు ముగించి - నీతి కిరీటము పొందెదము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------