1058) తంబుర సితారతో మా ప్రభుని ఆరాదించెను

** TELUGU LYRICS **

    తంబుర సితారతో - మా ప్రభుని ఆరాధించెదము
    తన నివాసముగ - మమ్ము సృష్టించిన
    నాథుని పొగడెదము స్తుతిగానము చేసెదము

1.  ఆది ఆదాము - మరణ శాసనము
    మా శరీరమున్ - ఏలుచుండగా
    అమరుడవై ప్రభూ - భువికేతెంచి
    మరణపు ముల్లు విరిచి - మరణమున్
    గెలిచిన మా ప్రభువా (2)

2.  పాపము నుండి - చీకటి నుండి
    ఆశ్చర్యకరమగు - వెలుగులో నడిపి
    తన ఆలయముగ చేసిన ప్రభుకు
    స్తుతి మహిమ - ఘనత
    సీయోనులో అర్పించెదమెప్పుడు

3.  పరలోక పిలుపుతో - ప్రభు మమ్ము పిలచి
    నరకపు శిక్ష - తొలగించె మానుండి
    పరిశుద్ధులతో - మమ్ము చేర్చిన ప్రభూ
    నిర్మించెను యిలలో - గృహముగా
    తన ఆత్మ ద్వారా

4.  ఆత్మీయ యింటికి - క్రీస్తే పునాది
    సజీవమైన రాళ్ళే ప్రజలు
    ఆత్మీయ గృహముకు - ప్రభువే శిల్పి
    ఆద్యంతరహితుడై - నడుపును
    మోక్షపురికి మమ్ము

5.  మన్నయినది - వెనుకటివలెనే
    మరల భూమికి తప్పక చేరున్
    మానవ సంపద - కీర్తి మహిమలు
    గతించి పోవునిల సీయోను
    మరువకు నీ ప్రభుని

6.  లెబానోను వీడి - నాతోరమ్ము
    లోకపు ఆశలు గతించిపోవును
    హెర్మోను గెత్సేమనే గొల్గొతా దాటుచు
    హెబ్రోను చేరుదము
    ప్రభువును ఆరాధించెదము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------