1066) తమ దేవునెరుగువారు చేసెదరు

** TELUGU LYRICS **

    తమ దేవునెరుగువారు చేసెదరు - శక్తితో గొప్ప కార్యములు

1.  ఇచ్చకపు మాటల వలన - అక్షయుని విడువరు
    తప్పుబోధల నెపుడు తృణీకరించెదరు

2.  సత్యమును విడువరు - ఉత్తములుగ నడిచెదరు
    అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు

3.  మనుజ భయము జెందరు - మాన్యులై యుండెదరు
    మంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు

4.  ద్వేషించెదరు విగ్రహముల్ - శిరములు ఖండించినను
    పర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు

5.  అగ్నిలో వేయబడినను - విఘ్నంబులు కలిగినను
    సింహపు బోనులో వేసినను సిగ్గునొందరు

6.  శోధనలను జయించెదరు - బాధలను సహించెదరు
    నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు

7.  అదిక జ్ఞానమును పొంది - తగ్గించె కొనెదరు తామే
    యేసు ప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------