** TELUGU LYRICS **
ఒంటరిని నేను ఒంటరిని
ఓడిపోయి నేను ఒంటరినై
ఓదార్పులేక ఓరిమిలేక
మరణమే ఇక శరణం అనుచు
అంతమవ్వాలని ఆశపడితి
ఓడిపోయి నేను ఒంటరినై
ఓదార్పులేక ఓరిమిలేక
మరణమే ఇక శరణం అనుచు
అంతమవ్వాలని ఆశపడితి
||ఒంటరిని||
1. దావీదు వలె నేను శ్రమలనొందుచు
నిందకు వేదనకు వేడుకనైతిని
ఒంటరినై నేను నిను వెదకుచుండగా
నీ వాక్యముచే నను ఆదరించి
ఇదిగో నేను ఉన్నాను అని నీవు
అభయము ఇచ్చితివి యేసు దేవా!
||ఒంటరిని||
2. తప్పిపోయిన తనయుని వలె నేను
తండ్రికి దూరమై ఒంటరినైతిని
తప్పు తెలిసి క్షమీయించుమని
నీ చెంతకు నే చేరితి తండ్రి
నీవు నన్ను కౌగిలించి
క్షమియించిన ఓ కరుణామయుడా!
||ఒంటరిని||
3. యాకోబు వలె నేను భయముతో వణకుచు
ఒంటరినై నీతో పోరాడుచుండగా
పేరు పెట్టి పిలిచినా దేవా
నీదు మోమును చూపించితివి
భయపడక నీవు సాగిపొమ్మని
దీవించితివి ఓ యేసు దేవా!
||ఒంటరిని||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------