537) ఒక్క మనుజు డెరుషలేమునుండి

** TELUGU LYRICS **

    ఒక్క మనుజు డెరుషలేమునుండి యెరికొ పట్టణమునకు మక్కు
    వతో వెడలుచుండె కొంత ధనముతో 
    ||ఒక్క||

1.  మార్గమందు దొంగలతని పట్టికొట్టి దోచుకొనిరి మూర్ఛపోవు నట్లు
    గొట్టి విడిచి వెళ్లిరి
    ||ఒక్క||

2.  అపుడు నొక్క యాజకుండు వచ్చి జూచి ప్రక్కగాను కపటముతో వెళ్లె
    వాని నాదరింపక
    ||ఒక్క||

3.  వెనుక నొక్క యాజకుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి
    పోయె గరుణలేకను
    ||ఒక్క||

4.  పిదప సమరయుండు వచ్చి జూచి యోర్వలేక గన్నులారా జూచి
    గరుణతోడ భేదమొంచక
    ||ఒక్క||

5.  నూనె ద్రాక్షరసము పోసి గాయములను గట్టి వాని ఘనమగు
    వాహనముమీద నూరు చేర్చెను
    ||ఒక్క||

6.  అటువలెను మనము కూడ కష్టములలో నుండువారి కష్టములను
    జూచి యాదరింపవలయును
    ||ఒక్క||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------