535) ఒక్క కోరిక నన్ను కోరనీ ఒక్క వరమే నన్ను అడగనీ


** TELUGU LYRICS **

ఒక్క కోరిక నన్ను కోరనీ - ఒక్క వరమే నన్ను అడగనీ 
నీ కోసమే బ్రతకాలనీ - నీ రాజ్యమునే చేరాలనీ 
నీ కోసమే బ్రతకాలనీ - నీ రాజ్యమునే చూడాలనీ 
||ఒక్క||

ఆరిపోనీకు ఈ దీపాన్ని 
కడవరకు నీకై నన్ను వెలగనీ 
ఆగిపోనీకు నా పయనాన్ని 
చివరి వరకు నీకై నన్ను సాగనీ 
||ఒక్క||

మూగవోనీకు ఈ కంఠాన్ని 
తుదిశ్వాస వరకు నిన్ను చాటనీ 
కూలిపోనీకు నా సాక్ష్యాన్ని
పరమపురికి నే చేరేంత వరకు 
||ఒక్క||

-------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Snehame Chalunaya (నీ స్నేహమే చాలునయా) 
-------------------------------------------------------------------------------------