606) ఓహో యెరూషలేమా బంగారు పట్నమా

** TELUGU LYRICS **

1.  ఓహో! యెరూషలేమా - బంగారు పట్నమా
    నీయందు దృష్టి క్షేమ - మింపార నుండుగా
    ఆ కాంతి సంబరమ్ము - ఏ కన్ను కాంచెను
    జీవంపు భోజనము నీలోను తిందుము

2.  సీయోను కొండపైన దూతాళి భక్తులు
    ఆ రక్త సాక్షులైన - వారెల్ల బాడుచు
    ఆ నిత్య కాంతిలోను - మహా ముదంబుతో
    శ్రీ యేసు క్రీస్తుతోను - సదా సుఖింతురహో

3.  విముక్తులైనవారు - శ్రీ యేసుతోడున
    జయంబు గొన్నవారు - నిత్యంబు నందున
    శ్రీ యేసు గద్దెచుట్టి - తెల్లంగి ధారులై
    కీర్తించి కేలుతట్టి - హర్షింతు నిత్యులై

4.  ఓ దివ్య పట్టణంబ విశ్రాంతి స్థానమా
    భక్తాళి వాంఛితంబ - ఆశింతు నిన్ సదా
    ఓ యేసు నన్నుగూడ - అచ్చోట జేర్చుము
    ఆ భాగ్యమేను జూడ - స్తోత్రింతు నెన్నడు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments