** TELUGU LYRICS **
ఓ కరుణానిధీ మహా ప్రభుయేసు - నీవే సింహాసనాసీనుడవైతివి
1. సత్యస్వరూపివి పరిశుద్ధుడవు - దావీదు తాళము కల్గియున్నావు
నీవు తెరచినది మూయగలేరు
బంధించినది తెరువగలేరెవ్వరు - నీ మహాత్మ్యమదే
నీవు తెరచినది మూయగలేరు
బంధించినది తెరువగలేరెవ్వరు - నీ మహాత్మ్యమదే
2. ఏడు నక్షత్రములు నీచేత కలవు - దీప స్తంభముల మధ్య
సంచరించెదవు - జీవించువాడవు ఆది అంతములు - రెండంచుల
ఖడ్గం కలిగిన ప్రభువా - అదియే నీ ఘనత
3. అగ్నివంటి నేత్రములు కల్గి - అపరాపరంజి వంటి పాదములు కలిగి
దేవుని ఏడు ఆత్మలు కలిగి - గ్రంధము తెరచే యోగ్యుడవీవే
ధన్యుడవు నీవే
4. నమ్మకమైన సత్యసాక్షియు - సర్వసృష్టికి కర్తయైయుండి
నీతిమంతుడు బహుజ్వాలామయుడు దీర్ఘశాంతుడు
శక్తిమంతుడు - ఆమెన్ అనువాడు
5. ఎల్లరు ప్రభుని స్తుతించెదరు - సాగిల పడెదరు కృతజ్ఞులై
ఆశ్చర్యక్రియలు చేసితివంచు - ప్రభువా నీవే అగమ్యుడవంచు
నినుకొనియాడెదము
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------