550) ఓడ్డుచేరి నీ యెదుట నిల్పునపుడు రక్షకా

** TELUGU LYRICS **

1.  ఓడ్డుచేరి నీ యెదుట
    నిల్పునపుడు రక్షకా
    ఒక్క యాత్మనైన తేక
    సిగ్గుపడిపోదునా.
    ||ఒక్క యాత్మనైన నేను
    రక్షింప యేసువా
    వట్టి చేతులతో నిన్ను
    దర్శించుట తగునా||

2.  ఆత్మలందు వాంఛలేక
    సోమరులై కాలమున్
    వ్యర్థపరచు వారానాడు
    చింతతోడ నిల్తురు.

3.  యేసువా! నా స్వరక్షణ
    నిశ్చయంబు యైనదే
    ఐనఫలితంబుజూడ
    కష్టపడనైతినే.

4.  కాలమెల్ల గడ్చిపోయెన్
    మోసపోతినేనయ్యో
    గడ్చినట్టి కాలమైతే
    ఏడ్చినను రాదది.

5.  భక్తులారా! ధైర్యంతోడ
    లేచి ప్రకాశించుడీ
    ఆత్మలెల్ల యేసుయొద్ద
    చేరునట్లు చేయుడి.

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------