780) కృపగల దేవుని కొనియాడెదము

** TELUGU LYRICS **

    కృపగల దేవుని కొనియాడెదము
    కృపచాలు నీకనే ప్రభుయేసు

1.  పాపములెన్నియో చేసినవారము
    నెపములెంచక తన ప్రాణమిడె
    కృపద్వారానే రక్షించె మనల

2.  కృపయు సత్యమును యేసు ద్వారనే
    కృపగల దేవుడు ఈ భువికి వచ్చె
    కృపతోడనే గాచును మనల

3.  సర్వకృపానిధియగు మన దేవుడు
    పరిపూర్ణత నిచ్చి బలపరచును
    స్థిరపరచి కాయున్ దుష్టుని నుండి

4.  సర్వ సత్యమును సత్యాత్మ తెల్పున్
    సర్వకాలము ప్రభుతో నిలుచుందుము
    సర్వము మీవని బోధించె

5.  శ్రమయైనను సిలువ బాధైనము
    శ్రమనొందిన క్రీస్తు ప్రభుతో
    క్రమముగా కృపచే సాగెదము

6.  ఇక జీవించువాడను నేను కాను
    ఇక జీవించుట నా ప్రభు కొరకే
    సకలంబు ప్రభున కర్పింతున్

7.  నేనేమై యుంటినో అది ప్రభు కృపయే
    నన్ను నడిపించును ప్రభువు సదా
    పెన్నుగా నేర్పును హల్లెలూయ 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments