790) కృపాసింహాసనుండా అల్ఫా ఓమేగా నీవేగా

** TELUGU LYRICS **

    కృపాసింహాసనుండా - అల్ఫా ఓమేగా నీవేగా
    కృపా - దాపునజేరి నుతించెద

1.  ఇదిగో సమస్తమును
    నూతనముగ చేయుచున్నాను - ఇదిగో
    మోదంబు గలుగజేసెద

2.  దైవవాక్యము గైకొని
    జీవించి జయించువాని - దైవ
    దేవాలయ స్తంభముగా జేతున్

3.  దావీదు తాళము గలిగి
    నా దేవుని పేరు వ్రాసెద - దావీదు
    జీవింపజేతున్ నెపుడచట

4.  సత్యస్వరూపిని
    నా క్రొత్త పేరు వాని పై వ్రాతున్ - సత్య
    సత్యమునందు నడిపింతున్

5.  పరలోకమును దిగివచ్చు
    పరిశుద్ధ పట్టాణము పేరు - పర
    మురియుచు వానిపై వ్రాతున్

6.  ఉత్తముడు యెహోవా
    క్రొత్తగీతము పోఅడుడి - ఉత్తముడు
    పుత్రుడేసుని మన కొసగెన్

7.  తండ్రికి ప్రియుడేసు
    అండగ నుండెను తండ్రి - తండ్రికి
    మెండుగ నాత్మతో నిండెన్

8.  సిలువపై ప్రాణమిడెను
    విలువ సమాధి నుంచబడె - సిలువపై
    గెలిచి లేచె సజీవుండై

9.  ఘనుడైన ప్రియుడేసు
    దీనుల యాదరించును - ఘను
    వినయముతో మనలను పిలిచెన్

10. ఉల్లంబులు రంజిల్లె
     ఎల్లప్పుడు ప్రభు మనతో నుండ - ఉల్ల
     హల్లెలూయ పాడెదము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------