748) క్రీస్తులేచె హల్లెలూయ లేచె జయశీలుడు

** TELUGU LYRICS **

1.  క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు!
    స్తోత్రమైన హల్లెలూయ! క్రీస్తు మళ్ళీ లేచెను
    చూచి మళ్ళీ తనకాంతి - హృదుల్ నాయనన్
    చింతవీడి సంతసాన వంగి క్రీస్తునెదుట
    పల్లవి: క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు!
    స్తోత్రమైన హల్లెలూయ! క్రీస్తు మళ్ళీ లేచెను

2.  క్రీస్తులేచె! మండలపు - చింతయంత తీరెను!
    హర్ష ద్వార మొప్పదీసి - మళ్ళీ జీవ మొందెను
    చావు నరకాలు మ్రొక్కి - దూతలెల్ల గల్వను
    కోట్లు చుట్టు కాంతి గూడ - లేచెనిప్డు శూరుడు

3.  క్రీస్తులేచె! నాటి వంత - యంత యంత మొందెను
    నేడు గొప్ప హర్షమాయె - క్రీస్తు లేచినందునన్
    శుద్ధ భూసమాధి తొలి - పంటను గల్గించెను
    వింతగన్ సజీవుడాయె - బోయిమళ్ళి కన్పడెన్

4.  క్రీస్తులేచె! నింక చావు! నరకాల భయము
    లేనె లేదు! క్రీస్తు నందు నన్ని గెల్చినారము
    మా భయాదులన్ని పోయి - శంకదిగులుంబాసె
    నేడు పునరుత్థానంపు - దీవెనల నొందుదము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------