** TELUGU LYRICS **
క్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు
ఆ నిరీక్షణ పరలోకమందు
మన కొరకై ఉంచబడి యున్నది
ఆ నిరీక్షణ పరలోకమందు
మన కొరకై ఉంచబడి యున్నది
1. సంపూర్ణము చేయబడిన - సిలువ కార్యమునందు
విశ్వాసము ద్వార మనలను - ఆయనే ఆయన యందు
నిరీక్షించు నటుల జేసెను
విశ్వాసము ద్వార మనలను - ఆయనే ఆయన యందు
నిరీక్షించు నటుల జేసెను
2. సూర్యచంద్రుల కాంతి - తేజోహీనమై పోగా
నక్షత్రముల కాంతియును - తరిగిపోయిన దినము
తానే నిరీక్షణ యగును
నక్షత్రముల కాంతియును - తరిగిపోయిన దినము
తానే నిరీక్షణ యగును
3. అన్యుడెవడును సీయోను నందు - వాసము చేయగలేడు
పరిశుద్ధ శిఖరమందున్న - దేవుడెహోవ యనియు
పరికించు నటుల జేసెను
పరిశుద్ధ శిఖరమందున్న - దేవుడెహోవ యనియు
పరికించు నటుల జేసెను
4. తుదమట్టుకు నిరీక్షణను - మనముంచిన యెడల
మందిర మందుండి పారుచు - ఉబికెడి ఊటగనుండి
నిరీక్షించు తన రాకడను
మందిర మందుండి పారుచు - ఉబికెడి ఊటగనుండి
నిరీక్షించు తన రాకడను
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------