798) కోటీశ్వరులైనా కడుపేదలైనా

కోటీశ్వరులైనా కడుపేదలైనా
అందరు కాటికే పోవాలి
అభిమానులేవున్నా అనామకులైనా
అందరు అంతమైపోవాలి
దిగంబరులుగానే వొచ్చాము
దిగంబరులుగానే వెళ్లిపోవాలి
అంతాతిరిగి మట్టికే పోతాము
ఇంతా తెలిసి ఎగిరెగిరి పడతాము

సిరిసంపదలెన్ని కూడబెట్టినా
చిళ్లిగవ్వైనా తీసుకెళ్లలేమని
ఒక్కజేబుకూడాలేని ప్రేతవస్త్రం
చాటేసత్యాన్ని ఎరుగవెందుకు?
భార్యాబిడ్డలా బంధుమిత్రుల బంధం
బ్రతికున్నంతవరకే పరిమితం
చేసిన పనుల ఫలముగ వెళ్లేలోకమే
మన అందరికి శాశ్వతం
ఏదిమన శాశ్వతం ఓ మనసా?
ఏది నిజసంపదో అదితెలుసా?
కోటీశ్వరులైనా కడుపేదలైనా
అందరు కాటికే పోవాలి
అందరు అంతమైపోవాలి

ఆస్తులను అప్పులను
ఐనవారికి విడిచిపెట్టి వెళ్లిపోతాము
పాపపుణ్యాలనే వెంటబెట్టుకునీ
మరో లోకానికి వెళ్లిపోతాము
పాపాలకు శిక్షగా నిత్యయాతనకు
నీతికి ప్రతిగా నిత్యజీవానికెళతాము
పాపముతీసి పరమున చేర్చేయేసే
మన నిజమైనా సంపద
పరమే మనశాశ్వతం ఓ మనసా?
క్రీస్తే నిజసంపద అదితెలుసా?
కోటీశ్వరులైనా కడుపేదలైనా
అందరు కాటికే పోవాలి

No comments:

Post a Comment

Do leave your valuable comments