620) కొండలవైపు కన్నులెత్తినా ఏ సహాయము దొరకలేదయా

** TELUGU LYRICS **

కొండలవైపు కన్నులెత్తినా
ఏ సహాయము దొరకలేదయా
బందువువైపు చేయి చాపినా
అక్కరలేమియు తీరలేదయా
నీ వల్లే సహాయము దొరుకునని

నీ పాద సన్నిధి చేరితిని
అక్కరతో వచ్చిన వారిని
అక్కున చేర్చే గొప్ప దేవుడా
మారాలాంటి స్థితిగతులన్నీ
మధురముగా మార్చిన దేవుడా

నీవే మాకు దిక్కని ఎంచి
నీ పాదముల శరణు వేడగా
కష్ట బాధలు కన్నీరంతా
తుడచి వేసిన గొప్ప దేవుడా
గాడాంధకారపు లోయలలోనా
అగాధ స్థలములో మొరపెట్టగా
మా కార్యములను సఫలపరచిన
విజయశీలుడా మంచి దేవుడా

కొండలవైపు కన్నులెత్తినా
ఏ సహాయము దొరకలేదయా
బందువువైపు చేయి చాపినా
అక్కరలేమియు తీరలేదయా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------