617) కొండల తట్టు నేఁ గోర్కెతోడ నాదు కన్ను లెత్తెద

** TELUGU LYRICS **

    కొండల తట్టు నేఁ గోర్కెతోడ నాదు కన్ను లెత్తెద నిప్పుడే దండియౌ
    సహాయ మెచటి నుండి నాకు వచ్చునో యండయౌ ప్రభునిచే స
    హాయంబు కలుగును 
    ||కొండల||

1.  ఆయన భూమ్యాకాశము లన్నిటను సృజించెఁగా యాయన యికఁ
    దొట్రిల్ల నీయఁడు నీ పాదముఁ
    ||కొండల||

2.  నిన్నుఁ గాపాడు వాఁ డెన్నఁడును గున్కఁడు పన్ను గ నిశ్రాయేల్ గా
    పాడు వాఁడు కున్కఁడు
    ||కొండల||

3.  నీకు యెహోవాయే నిజముగాఁ గాపగు నీ కుడిప్రక్కను బ్రభుం డు
    నీకు నీడగా నగుఁ
    ||కొండల||

4.  ధాత్రిఁ బగు లెండ దెబ్బ రాత్రి వెన్నల దెబ్బయే మాత్ర మైనను నిన్ను
    మార్కొనంగఁ జాలవు
    ||కొండల||

5.  ఏ యపాయమును రా నీయకుండ నా యెహోవ పాయక నినుఁ
    గాచును నీ ప్రాణముఁ గాపాడును
    ||కొండల||

6.  మోదంబుతో నిది మొదలుకొని నిత్యమున్ నీదు రాక పోకలందు
    నిను యెహోవా కాచును
    ||కొండల||

7.  జనక కుమారాత్మకును ఘనత మహిమ కల్గును మును పిపుడెల్లప్పుడు
    యుగ ముల కగుఁ గా కామేన్
    ||కొండల||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------