664) కరుణించుము నా యేసువా కనికరమందైశ్వర్యుడా

** TELUGU LYRICS ** 

    కరుణించుము నా యేసువా - కనికరమందైశ్వర్యుడా
    రేయింబగళ్ళు నే నెలుగెత్తి మొరబెట్టు - ప్రార్థనకు చెవి యొగ్గుమా

1.  నిత్యము మాకై విజ్ఞాపన చేయు - నిశీదరాత్రిన్ ప్రియుడా
    ప్రేమపితా నేడు మీ ఎదుట ప్రార్థించే - ప్రియుల ప్రార్థన వినుమా

2.  మా బంధు జనులు మా తల్లి దండ్రులు - మా ప్రియులు నశియించుట
    చూచి సహింపక కన్నీటితో చేయు మా ప్రార్థన వినుమా

3.  నీనెవె పట్టణ దుర్గతిని జూచి - కరుణించి కాపాడితివే
    యోనా మొరకొసగిన ఆలోచన నా కొసగ - నా బీదమనవి వినుమా

4.  శ్రమలెన్నో సహించి రక్షించితివే - ఇవియన్నియు వ్యర్థంబౌనా?
    అంజూరపు చెట్టుకై ప్రార్థించినా యట్టి ఆ ప్రార్థన వినుమా

5.  శోధన నుండి రక్షించితివే - సొదొమలో భక్తుని
    అబ్రాహాం ఆనాడు విన్నపించినట్టి - ఆది ప్రార్థన వినుమా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------