696) కలువరిలో విముక్తి కలిగెనో ప్రియుండా

** TELUGU LYRICS **

    కలువరిలో విముక్తి - కలిగెనో ప్రియుండా

1.  పాపమెరుగని యేసు - పాపముగ జేయబడి
    శాపంబు వహించి - శ్రమల సహించెను

2.  పాదహస్తముల నుండి - ప్రక్క గాయము నుండి
    ప్రవహించెను పుణ్య - ప్రణయామృత ధార

3.  ప్రభు యేసుని రక్తమే - ప్రేమామృత ధార
    ప్రియమారగ త్రాగు - ప్రభు సన్నిది జేరి

4.  ఘన ప్రేమనుజూపి - తన రక్తముచేత
    తానే కడుగును - మన పాపము నంత

5.  సర్వజనులకు - సువార్త నందించి
    సరియైనట్టి దారి - జూపింతుము వేగ

6.  ప్రాపంచసాగరాన - ప్రభువా నేను దుమికి
    పాపులను రక్షించు - ప్రాదేహత నిమ్ము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments