1006) జీవింపచేయుము నమ్మి ప్రార్థింతుము

** TELUGU LYRICS **

1.  సర్వశక్తి యుతుడా - సభకు శిరస్సా
    కొఱతయెక్కువాయెను - త్వరగా కృపనిమ్ము
    పల్లవి: జీవింపచేయుము నమ్మి ప్రార్థింతుము
    వాక్కు నెరవేరువరకు - కాచియుండెదము

2.  ప్రేమతో పిల్చితివి - నన్ను రక్షించితివి
    నీ జీవము నాలో వాడెను - నాదేవా దిగుము

3.  ప్రేమ చల్లారెనే - ఆత్మ కొఱతచే
    శవమువలె నైతిని - నీ చేత నన్నెత్తు

4.  ప్రార్థన వాంఛయు - వాక్యంబు నాసక్తి
    నాలో నూటగా రానిమ్ము - సర్వం సమర్పింతున్

5.  వైరి చెఱ వీడన్ - పోరుపట్టుదలతో
    సల్పి జీవపత్రిక గా - నీచే ప్రకాశింతున్

6.  ఆత్మ పెండ్లికుమారా - నీరాక కొరకై
    నిర్భయముతో వేచియుండ - నానిద్ర పోగొట్టు

7.  హల్లెలూయ పాడను - మరుపులు తొలగును
    శుద్ధాత్మను వెదకును - ఎల్లరకున్ చాటన్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------