992) జయించువాడు దేవకుమారుడు

** TELUGU LYRICS **

1.  జయించువాడు దేవకుమారుడు - భయము చెందక యుండుడి
    సర్వము పోగొట్టక స్వతంత్రించుకొనును - సర్వ దేవుని వాక్కిదే

2.  ఆది ప్రేమ వీడిన ఎఫెస్ సంఘమా - అదియే నీ కొఱత
    జయించిన నీవు జీవఫలములను - ప్రియముగ భుజియింతువు

3.  శ్రేష్ఠతమగు స్ముర్నా సంఘమా శ్రమలను నే మరువన్
    జయించిన నీకు రెండవ మరణము భయపడి హానిచేయదు

4.  పెర్గము సభ నీ బోధయు తప్పుడు - మార్గముల నెరుగుదున్
    జయించిన మరుగైన మన్నా క్రొత్త పేరు తెల్ల రాతినిత్తున్

5.  తుయతైర సభ నీశక్తి నెరుగుదున్ - నీ భయముల నెరుగుదున్
    జయించిన జనులపై నధికారమిత్తున్ - వేకువ చుక్కనిత్తున్

6.  సార్థిస్ సభ నీ చావు నే నెరుగుదు - త్వరలోన స్థిరపడుము
    జయించిన నీకు తెల్లని వస్త్రము - లిచ్చి నిన్నొప్పుకొందును

7.  ప్రియమగు ఓ ఫిలదెల్ఫియ సంఘమా - నీ అశక్యత తెలియున్
    జయించిన స్తంభముగా నుంచి నీకు - క్రొత్త నామము నిడుదున్

8.  లవొదికైయ సభ నీ లక్షణముల - దౌర్భాగ్యత తెలియున్
    జయించిన నిన్ను సింహాసనమున - నాతో కూర్చుండనిత్తున్

9.  జయమొందు విధమున తెల్పితి నిందు - జయించువారి భాగ్యము
    అపజయమును పొందు విధమును దెల్పితి - నీవెటు నిల్చెదవో

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------