252) ఇఁక నేమి గతి యున్నది మానవులారా

** TELUGU LYRICS **

    ఇఁక నేమి గతి యున్నది మానవులారా యిఁక నేమి గతి యున్నది
    పాపులకోస మిఁక నేమి గతి యున్నది యొకఁ డైనఁ ఋణ్యాత్ముఁ డుర్వి
    లేఁడని ముందె ప్రకటించి దావీదు పల్కె వేదము నందు 
    ||ఇఁక||

1.  ఇల రక్షకుఁడు లేమిని గొఱ్ఱెల మంద లిలఁ జెల్ల చెదు రాయెను
    పులులఁ బోలిన దైవ ములు గురువులు పెక్కు గల రేల వారు పద్దతి జూప
    జాలరు
    ||ఇఁక||

2.  దురితము లణఁగింపఁగఁ బాపుల నెల్ల దరిఁ జేర్చి బ్రతికింపగ పర
    మేశ్వరుఁడు తన వరపుత్రుఁ డగు క్రీస్తున్ ధర కంపె నయ్యేసు శరణుఁ
    జొరకయున్న
    ||ఇఁక||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------