254) ఇచ్చునట్టి విధము తెలియండి ప్రియులారా

    ఇచ్చునట్టి విధము తెలియండి ప్రియులారా మీరు హెచ్చు పొందు
    విధము ఇది నుండి పుచ్చుకొనుట కన్న నెప్పు డిచ్చుటయే కడు ధన్యత
    యని హెచ్చరించి చెప్పలేదా యేసు ప్రభు వపొస్తలులకు ||నిచ్చు||

1.  శక్తికొలఁది దాన మీయుండి సోదరులార భక్తికొలఁది పరుల కీయుఁ
    డి శక్తి లేదని సాకు చెప్పక సణగ కేమియు సరగ శ్రద్ధా సక్తితో పేదలకు
    నిచ్చుట యుక్త మని భావించి మదిలో ||నిచ్చు||

2.  నీతిబోధలు చేయువారికి బోధకులైన నిఖల పాలకులైన వారికి
    ఆతురముతో నీయవలెనని యనుభవముగల మీరలెల్లరు చేతులార నీయు
    డయ్య ప్రీతి తోడును వారవార ||నిచ్చు||

3.  ఆలయ కృత్యములు జరిగించు యాజకుఁ డెపుడు నాలయంబువలన
    జీవించు ప్రాలుమాలక పనిని జేయఁ బరఃగ మీ యర్పణలఁ గాన్కల
    బలవంతము లేక మీరు పలువిధంబు నియ్య వెదకుడి ||నిచ్చు||

No comments:

Post a Comment

Do leave your valuable comments