827) గర్భఫలము దేవుడిచ్చు బహుమానం

    గర్భఫలము దేవుడిచ్చు బహుమానం
    కుమారులు యోహోవా ఇచ్చు స్వాస్ధ్యము
    నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము
    వెలలేని విడిపోని తన ప్రేమ బంధము

1.  పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీపరింపరు
    ఒకవేళ చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు
    మన మనసెరిగిన దేవుడు తన బిడ్డనే మీ బిడ్డగా
    మీ గర్భంలోనే రుపిస్తున్నాడు
    వివాహానికిదే అర్ధం దీనిలోని పరమార్ధం

2.  ప్రతి బహుమానం తనకొరకే పెంచాలని మీకిచ్చాడు దేవుడు
    వాక్యమెరుగక దేవునికై బ్రతుకక నరకానికందరూ పోవుట న్యాయమా?
    మీ తండ్రి పనుల మీదుండాలని మీరెరుగరా?
    మీ తరమువారికి సేవచేసి నిద్రించరా?
    మనిషి జన్మకిదే అర్ధం దీనిలోని పరమార్ధం

No comments:

Post a Comment

Do leave your valuable comments