392) ఎంతమంచివాడవు ఎంత గొప్ప దేవుడవు నీకు సాటి ఎవ్వరు లేరయ్యా


** TELUGU LYRICS **

ఎంతమంచివాడవు - ఎంత గొప్ప దేవుడవు 
నీకు సాటి ఎవ్వరు లేరయ్యా 
దేవాది దేవుడవు - రాజాధి రాజువు 
నీవుంటే నాకు చాలయ్యా 
అ.ప: యెహోవా... యెహోవా... యెహోవా నా కాపరి 
యెహోవా... యెహోవా... యెహోవా నా ఊపిరి (2) 
||ఎంత||

పేరుపెట్టి పిలిచావు లాజరు రమ్మన్నావు 
కన్నీటిని తుడిచావు - కష్టాలే తీర్చావు
నీ మాటలో గొప్ప శక్తుందిలే 
నీలాంటి దేవుడు (ఏ) లోకాన లేదులే (2)  
||యెహోవా||

సంద్రాన్ని శాసించి - శాంతింప జేసావే 
పాపులను స్నేహించి - పవిత్రులుగా మార్చావే 
నీ పేరంటే దయ్యాలు వణికాయిలే
నీవంటే రోగాలు జడిసాయిలే 
నీలాంటి దేవుడు (ఏ) లోకాన లేదులే (2) 
||యెహోవా||

నశించిపోతున్న పాపాత్ములను పిలిచావే 
నీతిగా జీవించే - బోధలెన్నో చేశావే 
కల్వరిలో నీ ప్రేమ చూపావులే 
కలుషాత్ములెందరినో మార్చావులే 
నీలాంటి దేవుడు (ఏ) లోకాన లేదులే (2) 
||యెహోవా||

-----------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee vunte Chaalunaya (నీ వుంటే చాలునయా)
-----------------------------------------------------------------------------