** TELUGU LYRICS **
ఎంత ప్రేమించెనో దేవుఁడు మనపై నెంతదయఁజూపెనో వింతగల
యీ దైవప్రేమను సాంతమున ధ్యానింపరే
యీ దైవప్రేమను సాంతమున ధ్యానింపరే
||ఎంత||
1. పనికిమాలిన పాపాత్ములమైన మనము ఆ ఘనదేవునికి పిల్లలమనబడుటకై
తన కుమారుని మరణ బలిరక్తమున మన లను స్వీకరించుకొనెను దీనిని
జూడరే
తన కుమారుని మరణ బలిరక్తమున మన లను స్వీకరించుకొనెను దీనిని
జూడరే
||ఎంత||
2. పెంటకుప్పమీఁద పడియున్న యీ నీచ మంటి పురుగులను లేవనేత్తి
మింటిపై ఘనులతోఁ గూర్చుండఁజేయ నీ మంటి కేతెంచె మన వంటి
దేహము దాల్చి

3. ద్రాక్షారసపు మధురమును మించి యీ ప్రేమ సాక్షాత్తుగా మనపయినుండగా
ఈ క్షితినా ప్రేమ ద్రాక్షారసముకంటె దీక్షగవేడి యపేక్షింపతగునాహా
ఈ క్షితినా ప్రేమ ద్రాక్షారసముకంటె దీక్షగవేడి యపేక్షింపతగునాహా
||ఎంత||
4. మనలను ప్రేమించి తన ప్రాణమిచ్చిన ఘనుఁడా కాశమునుండి మరలి
వచ్చి మన దైన్యదేహమును తనరూపమును మార్చి కొనిపోయి తన
రాజ్యమును మనకీయును

5. గట్టిగ మనమునం దిట్టి నిరీక్షణ పెట్టియున్న సత్ క్రైస్తవులూ ప్రభు
డెట్టివాఁడొ మనమునట్టి వారుగ ప్రభుని కట్టడలను మదిని బెట్టియుందము
వేడ్క

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :