** TELUGU LYRICS **
ఎంత మధురము యేసు వాక్యము
నా జీవితకాలమంత నన్ను నడుపును
నా జీవితకాలమంత నన్ను నడుపును
1. అలసిసొలసిన సేదదీర్చును కరువు బరువులో ఆదరించును
కృంగినవేళ లేవనెత్తును శోధనవేళ జయమునిచ్చును
కృంగినవేళ లేవనెత్తును శోధనవేళ జయమునిచ్చును
2. ఆకలైనను ఆహారమిచ్చును శోకమైనను కన్నీరు తుడుచును
చింతలైనను మాన్పివేయును చెంతజేరన సంతోషమిచ్చును
చింతలైనను మాన్పివేయును చెంతజేరన సంతోషమిచ్చును
3. చీకటైనను వెలుగు చూపును పాపినైనను మార్చివేయును
వింతప్రేమను బయలుపరచును వెంబడించిన మేలుకలుగును
వింతప్రేమను బయలుపరచును వెంబడించిన మేలుకలుగును
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------