328) ఈరోజు క్రొత్త వెలుగు మన జీవితాలలో ఆ వెలుగు

** TELUGU LYRICS **

    ఈరోజు క్రొత్త వెలుగు
    మన జీవితాలలో ఆ వెలుగు
    ఆ వెలుగే యేసుక్రీస్తు (2)
    మన కోసం పుట్టాడు
    ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
    బలవంతుడైన దేవుడే నా యేసయ్యా
    హో..నిత్యుడవగు తండ్రీ సమాధానకర్త
    కరుణామూర్తి నా యేసయ్యా

1.  నీ జననం బంధకాలకు విమోచనా తరుణం (2)
    పాపముల భయమునుండి
    విడిపించిన ఇమ్మానుయేలు
(2) 
    ||ఈరోజు||

2.  నీ జననం లోకానికి రక్షణకు ఆధారం (2)
    బలహీనులకు బలమైన
    అనుగ్రహమే ఇమ్మానుయేలు 
(2)
    ||ఈరోజు||

3.  నీ జననం మానవాళికి సంతోషం కలుగజేసెను (2)
    భూ జనులకు వెలుగైన
    ఆప్రభువే ఇమ్మానుయేలు 
(2)
    ||ఈరోజు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------