1250) దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో

** TELUGU LYRICS **

    దేవుడు ప్రేమతో దేవుడు ప్రేమతో
    చేసాడు సృష్టినీ సృష్టంత నీకని
    తన మదిలో ప్రేమ ఎంత ఉన్నదని
    చూపెను ప్రేమతో (2)

1.  గర్భంలో ఉన్నావనీ ఉమ్మనీరె త్రాగేస్తావనీ
    నవ మాసాలు నీటిలో బ్రతికించెను ప్రేమతో
    గర్భంలో ఉన్నావనీ ఉమ్మనీరె త్రాగేస్తావనీ
    నవ మాసాలు కాపాడెను నిను దేవుడు ప్రేమతో
    నువ్వు గర్బములో ఉండగా ఆహారమే అందించెను
    తల్లిదండ్రుల ప్రతి మాటను గర్భములో వినిపించెను
    చీకటిలోనే ఉన్నావని నీ కంటికి వెలుగిచ్చెను
    ||దేవుడు ప్రేమతో||

2.  గర్భంలో ఉన్నావనీ విశ్రాంతి ఇవ్వాలనీ
    ఏదని నీకు లేకుండ మరణమిచ్చెను ప్రేమతో
    మరణమే ఇవ్వాలనీ విశ్రాంతిని ఇవ్వాలనీ
    దేవుని పనే లేకుండా మరణమిచ్చెను ప్రేమతో
    ఏ కష్టము లేకుండగా అదృష్టము కొందరికే
    ఏ పాపము లేకుండగా స్వర్గం నీకొక్కరికే
    పుట్టిన వారికి పని ఉందని మరణిస్తేనే మేలని
    ||దేవుడు ప్రేమతో||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------