1255) దేవుడు లోకమును యెంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని

** TELUGU LYRICS **

    దేవుడు లోకమును యెంతో ప్రేమించెను
    అద్వితీయ కుమారుని అనుగ్రహించెను

1. ఎవరాయనను విశ్వసించెదరో నశింపక నిత్యజీవము పొందెదరు

2. తన ప్రేమ యెంతో శాశ్వతమైనది రక్తము కార్చి ప్రాణమునిచ్చె

3. ప్రభువు పిలిచెను పాపుల నెల్ల - వచ్చినవారె కడుగబడెదరు

4. తప్పినవారిని వెదకుచున్నాడు - వచ్చినవారె ముక్తి పొందెదరు

5. పాపముచేత చచ్చిన మిమ్ము - ప్రభుకోరుచుండె జీవమునివ్వ

6. నలిగిన మనస్సు కలిగినవారె - గొప్ప రక్షణను పొందెదరిలలో

7. క్రొత్త జన్మమును ఎత్తనివారు ప్రవేశింపలేరు ప్రభురాజ్యమందు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------