** TELUGU LYRICS **
దేవసుతుడు యేసు జన్మించె - నిరతము స్తుతియింతుము
1. పాపుల రక్షించ పరమ నాథుడు - శ్రమలను పొందెను ఆ ...
నశియించిన వారిన్ వెదకి రక్షింప - రక్షకుడై పుట్టెను

2. బెత్లెహేములో నుత్తముడు జన్మించెను - తండ్రి చిత్తము చేసెను ఆ ...
భక్తులు పాదములకు మ్రొక్కిరి - మనము స్తుతియింతుము

3. ఘనుడు పుట్టెను పశుల పాకలో - గొల్లలు పూజించిరి ఆ ...
వేరే జనులు చోటీయకున్నను - మనము స్తుతియించెదము

4. పుట్టినరాత్రి ప్రకాశమానం - మృతిన్ పగటలో ఆ ...
స్తుతులకు తగిన శుద్ధుడు దూతల - స్తుతులను బొందెన్

5. నరులు బొంకినను వేదము బొంకదు - నరుల హృదయమేమో ఆ ...
పుణ్యుని జన్మము మీ మదినున్న - పూజింతురు వాని

6. అనాది దేవుని చిత్తముచే - శ్రీ - బయలుపడెను ఆ ...
జలనిధి వలెనే ఆయన జ్ఞానము - మనలను నింపును

7. ఆనందముగా యెహోవాకు - హల్లెలూయ పాడెదము ఆ ...
హల్లెలూయ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ - హల్లెలూయ ఆమెన్

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :