1238) దేవా వెంబడించితి నీ నామమున్

** TELUGU LYRICS **

    దేవా! వెంబడించితి నీ నామమున్ జీవితేశ్వర నా జీవితాశ నీవే రావె
    నా భాగ్యమా యేసువా 
    ||దేవా||

1.  యేసూ! నీదు ప్రేమను నే వింటిని భాసురంబగు నీ సిలువ నే గంటిని
    యేసువాడను నే నంటిని
    ||దేవా||

2.  ప్రభో! ప్రారంభించితి ప్రయాణమున్ పరలోక యెరూషలేము పురికిన్
    పావనా జూపుము మార్గము
    ||దేవా||

3.  నాధా! ఈదలేను ఈ ప్రవాహమున్ నీదరిన్ గాన నీ కెరటాలధాటిచే
    నావికా రమ్ము నన్ బ్రోవుము
    ||దేవా||

4.  స్వామి! నీదు ప్రేమకు నే సాక్షిని సంఘమందున నా పొరుగువారికి నీ
    సత్య సువార్త నే జాటుదున్
    ||దేవా||

5.  రాజా! నీదు రాజ్యములో జేరితి రమ్యమౌ రాజ్యమందున నన్ వాడుము
    రక్షణానందము గూర్చుము
    ||దేవా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------