1240) దేవా సంవత్సరమును దయాకిరీటముగా

** TELUGU LYRICS ** 

    దేవా సంవత్సరమును దయాకిరీటముగా నిచ్చి యున్నావు
    దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నవి

1.  నీ మీద నా దృష్టి నిలిపి - నీకాలోచన నే చెప్పెదను
    అనిన మహోన్నతుడా

2.  సతతము మీతో కూడా నేను - ఉన్నాననిన మా ప్రభు యేసు
    అభయంబొసగిన మా

3.  తలవెండ్రుకలు నెరయు వరకు - నేనే నిన్ను ఎత్తుకొనుచును
    రక్షించెద ననిన

4.  నీవే నాదు సొత్తని పిలచి - శాశ్వతముగ నిను ప్రేమించితిని
    అనిన ప్రేమామయుడ

5.  మా కాపరివై మాదు ప్రభుడవై - జీవజలముల చెంతకు మమ్ము
    నిడిపించెద ననిన

6.  పలువిధములగు బాధలు పొంది - రక్తము కార్చి ప్రాణము నిచ్చి
    రక్షించిన మాదు

7.  మా ప్రభుయేసు మహిమయు నీదే - నీ నామమున పాడెద మెపుడు
    హల్లెలూయా ఆమెన్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments