1229) దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం

** TELUGU LYRICS **    

    దేవా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం నీ కుడి హస్తములో
    నిత్య సుఖములు కలదు
    నాకు క్షేమాధారం కాపాడే నా దేవా
    నీకేనా వందనము నీకేనా స్తోత్రములు
    స్తోత్రరూపమగు నా క్రొత్త గీతములు
    నా నోటనుంచావు నా యేసయ్యా (2)

1.  దేవా నీ కృపలోనే వర్ధిల్లే నా జీవం
    అనుదినము నీకొరకే సాక్షిగనేనుండెదను
    నాకు విరోధముగా రూపింపబడిన
    ఏ విధ ఆయుధము వర్ధిల్లనేరదు
    ||స్తోత్రరూపమగు||

2.  దేవా నీ వాక్యము వెల్లడియగుతోడనే
    జీవితమంతయు వెలుగు కలుగుచుండ
    దినదినము నా భారం
    భరియించు నా దేవా
    నీకేనా వందనము నీకేనా స్తోత్రములు
    ||స్తోత్ర రూపమగు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------