1234) దేవా మా గృహంబును సదయుండవై

** TELUGU LYRICS **

    దేవా, మా గృహంబును సదయుండవై దీవించుటకు రారమ్ము నీవె
    యిద్దానిని నెఱదాతవగుచు స ద్భావముతో నిచ్చితివి బహుమానముగ
    మాకు 
    ||దేవా||

1.  మా యింటి యజమానుండ వీవెసుమ్మి మా యింటి ప్రభుఁడ వీవె
    పాయక మా యింట భవదీయాభీష్టంబె శ్రేయోదాయకమగుచు సిద్ధిం
    చెడును గాక
    ||దేవా||

2.  మా యాస్తిపాస్తులన్ని మా కబ్బె భవ దీయానుగ్రహ బలముచే
    నీయాననవ్వాని నీ యలఘ సేవకై న్యాయముగ నర్పింప నీయవె ఘన
    బుద్ధి
    ||దేవా||

3.  నీవిచ్చు ధననిధులైన మా బిడ్డలు కేవలము నీ దాసులై భావివానిరి
    మణుల ఠేవనుద్భాసిల్ల నీవెవారిని భృశము ప్రోవుమాయువొసంగి
    ||దేవా||

4.  రేపుమాపీ గృహునఁ బ్రోక్తములగుచు దీవించు ప్రార్థనముల
    లోపరహితంబులుగా ధూపధూమములట్లు నీ పాదయుగళి స మీపింప
    నిమ్మెపుడు
    ||దేవా||

5.  ఏ రోగమును నెపుడేని మా మందిరపు ద్వారంబు చొరనీయక
    ఆరోగ్యభాగధే యంబిచ్చి మమ్ములను భూరికృపబ్దివై పోసింపుమను
    దినము
    ||దేవా||

6.  ఇరుగుపొరుగు వారలతో సమాధాన పరతవసింపను నేర్పి కొఱగాని
    కలహములు త్వరపెట్ట నవ్వాని భరియింపఁదగు సహాన భావంబు మా
    కిమ్ము
    ||దేవా||

7.  బీదసాదల కెల్లరకు మా గృహమెప్పు డాదరణాస్పదమై యుండ నీ
    దానాసారంబు నెఱవర్షించిన కొలఁది నౌదార్యగుణము మా యందుఁ
    బెంచుము సొరిది
    ||దేవా||

8.  నక్కలకు బొరియలుండు దివి పక్షులకుఁ జక్కని గూళ్లునమరు
    నొక్కింత యిక్కనా కెక్కడలేదనిన చక్కని నరసుతమా సదనంబు నకు
    రమ్ము
    ||దేవా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments