** TELUGU LYRICS **
దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే
ఎండియున్న భూమిపై జలముల్ - ప్రవహింప జేయునాయనే
1. వడిగల జలములలో దారిన్ - నిర్మించును ఆ ప్రభువే
అడవులలో రాజబాటలను - స్థాపించును మన ప్రభువే
2. మన సంతతిపై ఆత్మన్ - కుమ్మరించును మన ప్రభువే
తన ఆత్మలో వారిని నింపి - నిర్మించును సంఘముగా
3. నీటికాలువలయొద్ద - నిరవంజి చెట్లవలె
గడ్డిలో యెదుగునట్లు - వారు వర్ధిల్లెదరు
4. కరుణాపీఠము పై నుండి - మాట్లాడెను మన దేవుడే
పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే
5. ఆకాశము తెరువబడగా - మాట్లాడెను మన దేవుడే
ఒక శబ్దముచే తన సుతుని - ఘనపరచెను మన దేవుడే
6. మందసమున్ దేవుని ప్రజలు - మందిరమందుంచగనే
మందిరమున్ క్రమ్మెను ప్రభుని - తేజోమహిమంతటను
7. తన ప్రజలెల్లప్పుడు క్రీస్తున్ - సేవింతురు హర్షముతో
దిన దినము దేవునికొల్చి - హల్లెలూయ పాడెదరు
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------