948) చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం

** TELUGU LYRICS **

    చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం  
    అపవాది శక్తులతో అనుదినము పోరాటం (2)
    ఏనాడో గెలిచాడు యేసు దేవుడు 
    శత్రువుని మన పక్షాన
    అపవాది తల త్రొక్కి లేచినాడుగా 
    మనకివ్వ విజయాన్ని యే యే యే యే యే
    యేసు రక్తమే జయం జయం 
    అపవాది క్రియలకు అనంత నాశనం (2)
    చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం 
    అపవాది శక్తులతో అనుదినము పోరాటం (2)

1.  మేం చేసే ఈ యుద్ధం శరీరులతో కాదు 
    ఆకాశ దురాత్మలతో శక్తులతోనే పోరు (2)
    ప్రధానుల్ అధికారులెవరైన 
    అంధకార సంబంధ నాధులైన
    యేసయ్య నామంలో వంగాలి  
    యేసయ్య నామంలో ఓడాలి
    యేసయ్య నామంలో వంగాలి ఓడాలి 
    ప్రభుకే మ్రొక్కాలి
    యేసు రక్తమే జయం జయం 
    అపవాది క్రియలకు అనంత నాశనం (2)
    చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం 
    అపవాది శక్తులతో అనుదినము పోరాటం

2.  అపవాది తంత్రాలు మేం ఎరుగని వారము కాము 
    మా నోటి సాక్ష్యముతో ప్రభు రక్తముతో గెలిచెదము (2)
    సర్వాంగ కవచాన్ని ధరియించి 
    విశ్వాస డాలును ముందుంచి
    అపవాది అగ్ని బాణాలార్పేస్తాం 
    శ్రమ శోధన దూషణలన్నిటి జయిస్తాం
    అపవాది అగ్ని బాణాలార్పేస్తాం గెలిచేస్తాం ప్రభునే స్తుతిస్తాం
    యేసు రక్తమే జయం జయం  
    అపవాది క్రియలకు అనంత నాశనం (2)
    చేద్దామా పోరాటం ఆత్మీయ పోరాటం 
    అపవాది శక్తులతో అనుదినము పోరాటం

3.  హృదయానికి ప్రభువిచ్చాడు నీతి అనే కవచం 
    ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోపరచి చెరపడతాం (2)
    దేవుని నీతి మేం అగునట్లు 
    మా నీతి ప్రభువే అయ్యాడు
    సింహంలా ధైర్యముగా మేముంటాము 
    ఏడు మార్లు పడినా తిరిగి లేస్తాము
    సింహంలా ధైర్యముగా మేముంటాము లేస్తాము ప్రభునే చూస్తాము
    యేసు రక్తమే జయం జయం 
    అపవాది క్రియలకు అనంత నాశనం (2)

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------