687) కల్వరిలోని శ్రేష్టుడా కరుణా భరిత సింహమా

    కల్వరిలోని శ్రేష్టుడా - కరుణా భరిత సింహమా
    కన్ను భ్రమించు ప్రభువా - నిలువలోని మిత్రుడా

1.  స్తుతుకి పాత్రుండగువాడా - దూతలతో వెంచేయువాడా
    సుదతి మరియ పుత్రుడా - సిలువలోని మిత్రుడా

2.  పాపులకై వచ్చినవాడా - ప్రేమ గల్గిన రక్షకుడా
    పాదములపై బడితిమి - సిలువలోని మిత్రుడా

3.  దీవెనల నిచ్చుటకై - వసుధ కేతించినవాడా
    నీవే సుంకరు లాప్తుడవు - సిలువలోని మిత్రుడా

4.  అయిదు రొట్టెలు మరి రెండు - చేపలతో నైదు వేల
    జనుల పోషించిన తండ్రి - సిలువలోని మిత్రుడా

5.  నీళ్ళను రసముగ మార్చితివి - నీళ్ళ మీద నడిచితివి
    మేళ్ళ నొసగు మా దాతా - సిలువలోని మిత్రుడా

6.  రోగుల బాగుచేయువాడా - గ్రుడ్డికి నేత్రము లిచ్చితివి
    అనాధుల నాయకుడా - సిలువలోని మిత్రుడా

7.  హల్లెలూయా కర్హుడా - యెల్లరు కొనియాడు వాడా
    బలముతో వచ్చువాడా - సిలువలోని మిత్రుడా

No comments:

Post a Comment

Do leave your valuable comments