136) ఆత్మ! శృంగారించు కొమ్ము

** TELUGU LYRICS **

1.  ఆత్మ! శృంగారించు కొమ్ము
    పాప గుహ వీడి పొమ్ము
    వెల్గులోని కింకరమ్ము
    తేజరిల్లు మీ దినము
    "రక్షణాధి కారవిందు
    నీకు జేయ బోవుముందు
    భూదినంబు లేలు ఱేడు
    నిన్ను జేర వచ్చు నేడు"

2.  పెండ్లి కూతురెట్లు భర్త
    నట్లు ప్రేమ జూపుకర్త
    నాయ నెంతో జాలిగుండె
    తోడ దల్పు దట్టు చుండె
    "నా ప్రియుండ! వేగరమ్ము
    ముద్దు బెట్ట నిమ్ము నన్ను"
    అందు హృదయంబుతోడ
    యేసునాద నాహ్వానించు.

3.  శ్రేష్ఠ వస్తువుం గ్రయంబు
    జేయ గొండ్రు బల్ధనంబు
    సర్వ శ్రేష్ఠమౌ వరంబు
    లిచ్చు చుంటి యుచితంబు
    కాకయున్న నీ శరీర
    రక్తముల్గొనంగ నీర
    రాసులైన గనులైన
    జాలునా మరేవియైన?

4.  నిశ్చలంపు బ్రేమ నిన్ను
    చీల్చి భూమికంటె నన్ను
    మాకునైత్వదీయ ప్రాణ
    మిచ్చినాడ వట్లు గాన
    ఆమేన్.
    చిందబడ్డ నీ శరీర
    రక్త బిందు లింపుమీర
    రాత్రి భోజనాన మాక
    నంత ప్రేమ పెంచుగాక

5.  యేసు! జీవ భక్తమైన
    నీదు బల్ల గంటినైన
    వ్యర్థ నష్టతల్ల భింప
    నీకు, దీననే నశింప
    భూమి మీద బోలె మింట
    నిన్ను గూడి త్రాగి తింటి
    కీసు భోజనంబు నందు
    నీదు ప్రేమ జూపుమందు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------