132) ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు

** TELUGU LYRICS **

    ఆత్మ మందిరమును - ప్రభు కట్టుచున్నాడు
    ఆత్మ నియమముతో - నిర్మించున్

1.  మందిర దర్శన - మాత్మకు నిచ్చి
    ఆత్మ ద్వార నే - కనపరచున్

2.  ఆత్మ జీవముతో - నిర్మించబడును
    నిండు జీవముతో - దృఢ మగును

3.  ఆత్మైక్యముతో - నిర్మించబడును
    ఆత్మతో నపుడే - నింపబడున్

4.  ఆత్మీయ సేవను - ఆత్మసేవకులన్
    ఆత్మ మందిరములో - ప్రభు కోరున్

5.  ఆత్మీయ బలులను - అర్పించు నపుడే
    ప్రభు మనసు సంతృప్తి పడున్

6.  ఆత్మ మందిరములో - లోక శరీర
    ఆశయములకు - పాలులేదు

7.  ఆత్మ మందిరములో - అన్నియు నుండిన
    లోకము జీవముతో నిండున్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------