142) ఆదినములలో దేవోక్తి అరుదాయెను

** TELUGU LYRICS ** 

    ఆదినములలో దేవోక్తి - అరుదాయెను - దేవునివార్త
    ఆదినములలో దేవోక్తి
    అను పల్లవి: దైవోక్తి ప్రత్యక్షత - దొరుకునదే - అరుదాయెనట
    ఆదినములలో దేవోక్తి

1.  ఇశ్రాయేలీయుల కానాడు - యే రాజు లేకపోయె
    తనయిష్టానుసారముగా తిరుగుచుండెను ప్రతివాడు

2.  పరమ తండ్రి మందసము - చెరపట్టినందున
    ప్రభావము పోయెను - ప్రభుని ప్రజలలో నుండి

3.  దావీదంతకంతకు - దినదినము వర్థిల్లెను
    సైన్యములధిపతి యెహోవా - సర్వదా తనతోడై యుండెను

4.  సొలమోనర్పించిన - బలుల నగ్ని కాల్చగనే
    ప్రభుని ఆలయమంతయు - ప్రభావముతో నిండెను

5.  లెమ్ము తేజరిల్లుము - నీకు వెలుగు కలిగెను
    యెహోవా తండ్రి మహిమ - నీ మీద నుదయించెను

6.  యెహోవా పట్టణమని - ఇశ్రాయేలు పరిశుద్ధ
    దేవుని సీయోనని - నీకు పేరు పెట్టెదరు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------