248) ఆహా యేమానందం ఆహా యేమానందము

** TELUGU LYRICS **

ఆహా యేమానందం ఆహా యేమానందము
చెప్ప శక్యమా (2)
ఆహా మా రాజగు యేసు మా వృజినముల
మన్నించి వేసెను (2) 
||ఆహా||

ముదముతో నాడుచు కూడుచు పాడుచు
ఆర్భాటించెదము (2)
వెదకుచు వచ్చిన యేసును హృదయాన
కోరి స్తుతింతుము (2)
||ఆహా||

అక్షయుడగు ప్రేమతో రక్షణ బాకాను
గ్రహించినందున (2)
రక్షకుడు యేసును గూర్చి మా సాక్ష్యము
నిశ్చయముగా నిత్తుము (2)
||ఆహా||

తెల్లంగి వాద్యము స్వర్ణ కిరీటము
మేడపై జయ జెండాల్ (2)
ఉల్లాసించి మంటి నుండి మింట కేగిన
రాజున్ స్తుతింతుము (2)
||ఆహా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------